తెలంగాణ

ఇండిగో విమానంలో హైదరాబాద్ కి చేరుకున్న చంద్రబాబు... !

హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబుకు... శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో టీటీడీపీ నేత బక్కని నర్సింహులు, మహిళా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

ఇండిగో విమానంలో హైదరాబాద్ కి చేరుకున్న చంద్రబాబు... !
X

హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబుకు... శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో టీటీడీపీ నేత బక్కని నర్సింహులు, మహిళా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును చూసి కంటతడి పెట్టారు. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.

తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో తొమ్మిది గంటల పాటు నిరసన దీక్ష చేపట్టిన చంద్రబాబు.. అక్కడ్నుంచి హైదరాబాద్‌ వచ్చారు. తిరుపతి వెళ్లకుండా ఆంక్షలు విధించిన పోలీసులు.. దగ్గరుండి బోర్డింగ్‌ పాస్‌ తీసుకుని.. చంద్రబాబును హైదరాబాద్‌ పంపించారు. ఉదయం నుంచీ ఎయిర్‌పోర్ట్‌లో దీక్ష చేసిన చంద్రబాబును హైదరాబాద్‌ పంపించేందుకు పోలీసులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచే ఒకటి తర్వాత మరొక విమానంంలో టికెట్లు బుక్‌ చేసినా... చంద్రబాబు వెనక్కి తగ్గలేదు. చివరికి రాత్రి ఏడు గంటల 10 నిమిషాలకు చంద్రబాబు తిరుపతిలో ఫ్లైట్‌ ఎక్కి హైదరాబాద్ వచ్చారు.

Next Story

RELATED STORIES