GFST ఛైర్మన్ హోదాలో చంద్రబాబు

హైదరాబాద్‌లో GFST ఆధ్వర్యంలో డీప్ టెక్నాలజీస్ అనే అంశంపై సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు GFST ఛైర్మన్ హోదాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. భారతదేశం ప్రపంచంలోనే నంబర్‌వన్ ఆర్థిక వ్యవస్థగా మారడానికి తీసుకు రావాల్సిన పాలసీలు, టెక్నాలజీ పాత్రపై చర్చిస్తున్నారు. GFST సదస్సుకు చంద్రబాబుతో పాటు ఆర్థిక రంగ నిపుణులు, పర్యావరణవేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అధికారులు, కార్పొరేట్ ప్రముఖులతో పాటు విద్య, వైద్య, న్యాయ, మీడియా రంగ నిపుణులు సైతం ఈ సదస్సులో పాల్గొన్నారు. పాలసీల రూపకల్పన, రీసెర్చ్, నాలెడ్జ్ షేరింగ్ అనే అంశాలకు GFST వేదికగా పనిచేస్తోంది. మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగం, లాజిస్టిక్స్, తయారీ పరిశ్రమలు, MSME పరిశ్రమలు, టెక్నాలజీ, స్టార్టప్ ఎకోసిస్టమ్ వాతావరణ మార్పులు, ప్రజారోగ్యం లాంటి అంశాలపై GFST పనిచేస్తోంది. ఇండియా ఎట్ హండ్రెడ్ అనే అంశంలో భాగంగా జూన్ నెలలో డీప్ టెక్నాలజీస్.. సెప్టెంబర్‌లో లాజిస్టిక్స్.. డిసెంబర్‌లో ఫార్మా అండ్ హెల్త్ కేర్ సెక్టార్లపై సదస్సులు నిర్వహిస్తారు. రానున్న రోజుల్లో ఈ విభాగాల్లో, రంగాల్లో తీసుకు రావాల్సిన పాలసీలపై చర్చించి నివేదికలు సిద్ధం చేస్తారు. ఈ నివేదికల్ని నీతిఆయోగ్, కేంద్రప్రభుత్వ సంస్థలు, పలు ఏజెన్సీలతో పంచుకుంటారు. తద్వారా మెరుగైన పాలసీల రూపకల్పనకు తమ వంతుగా GFST సహకారం అందిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com