Chandra Babu : ప్రతీ ఒక్కరూ దేశభక్తి, జాతీయభావం పెంపొందించుకోవాలి : చంద్రబాబు

Chandra Babu : ప్రతీ ఒక్కరూ దేశభక్తి, జాతీయభావం పెంపొందించుకోవాలి : చంద్రబాబు
X
Chandra Babu : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

Chandra Babu : ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయ భావం పెంపొందించుకోవాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో మహానుభావుల త్యాగాలు, పోరాటం వల్లే స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. వారందరిని గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వారి స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు చంద్రబాబు.

15 వందల ఏళ్లక్రితం భారత దేశం సుసంపన్నంగా ఉండేదన్నారు. విదేశీయుల దాడుల్లో దేశం సర్వం కోల్పోయిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక అనేక మంది నాయకులు దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. 75 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని సమీక్షించుకోవాలన్నారు.

Tags

Next Story