ఓ పెట్రోల్ బంక్‌లో నిలువు దోపిడీ.. బయటపడ్డ ఘరానా మోసం..!

X
By - TV5 Digital Team |7 March 2021 4:53 PM IST
ఈద్గామ్ చౌరస్తా దగ్గర ఉన్న రాఘవేంద్ర పెట్రోల్ బంకులో ఓ కారు ట్యాంక్ ఫుల్ చేయమని యజమాని కోరాడు.
పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలు అందరికీ తెలిసిందే. అయితే నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకులో జరిగిన మోసం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ఈద్గామ్ చౌరస్తా దగ్గర ఉన్న రాఘవేంద్ర పెట్రోల్ బంకులో ఓ కారు ట్యాంక్ ఫుల్ చేయమని యజమాని కోరాడు. అయితే అందులో 59 లీటర్లు కొట్టినట్లు.. బిల్లు ఇచ్చారు. దీంతో అవాక్కైన యజమాని.... 50 లీటర్ల కెపాసిటీ ఉన్న కారులో 9 లీటర్లు ఎలా కొట్టారంటూ ప్రశ్నించే సరికి ఉద్యోగులు తెల్లమొహం వేశారు. ఈ లెక్కన లీటరుకు దాదాపు 200 మిల్లీ లీటర్లు తక్కువగా పోస్తున్నారని యజమాని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com