CHEVELLA ACCIDENT: అయ్యో... దేవుడా..

CHEVELLA ACCIDENT: అయ్యో... దేవుడా..
X
కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన చేవెళ్ల ప్రమాదం

చే­వె­ళ్ల బస్సు ప్ర­మా­దం ఎన్నో కు­టుం­బా­ల్లో చీ­క­టి­ని నిం­పిం­ది. ఈ ఘోర ప్ర­మా­దం­లో ఒక హృదయ వి­దా­రక దృ­శ్యం అం­ద­రి­నీ కల­చి­వే­సిం­ది. తల్లి పొ­త్తి­ళ్ల­లో వె­చ్చ­గా పడు­కు­న్న చి­న్నా­రి ప్ర­మా­దం­లో తల్లి చే­తు­ల్లో­నే ప్రా­ణా­లు వది­లిం­ది. తల్లీ­బి­డ్డ రో­డ్డు­పై మృతి చెం­దిన దృ­శ్యా­లు గుం­డె­ను పిం­డే­శా­యి. ఈ రో­డ్డు ప్ర­మాద దృ­శ్యా­లు హృ­ద­యా­న్ని కలి­చి­వే­స్తు­న్నా­యి. ము­ఖ్యం­గా రో­డ్డు­పై విగత జీ­వు­లు­గా పక్క­ప­క్క­నే పడి­ఉ­న్న తల్లీ­బి­డ్డల ఫొటో ప్ర­తి ఒక్క­రి­నీ కం­ట­త­డి పె­ట్టి­స్తుం­ది. మృ­తు­ల్లో 15 నెలల చి­న్నా­రి, ఆమె తల్లి కూడా ఉన్నా­రు. తల్లి తన ఒడి­లో పా­ప­ను పట్టు­కొ­ని ఉం­డ­గా­నే ఇద్ద­రూ ప్రా­ణా­లు కో­ల్పో­యా­రు. కం­క­ర­లో కూ­రు­కు­పో­యిన ఆ తల్లీ­బి­డ్డల మృ­త­దే­హా­ల­ను చూ­సిన స్థా­ని­కు­లు, తోటి ప్ర­యా­ణి­కు­లు కన్నీ­రు ము­న్నీ­ర­య్యా­రు. అయ్యో దే­వు­డా.. ఏం­ట­య్యా ఈ ఘోరం అంటూ గుం­డె­లు బా­దు­కు­న్నా­రు. చి­న్నా­రి­ని కంకర కు­ప్ప నుం­చి బయ­ట­కు తీసే దృ­శ్యా­ల­ను చూసి మనో­వే­ద­న­కు గు­ర­య్యా­రు.


విద్యార్థులే ఎక్కువ

తాం­డూ­రు నుం­చి హై­ద­రా­బా­ద్‌­లో­ని కా­లే­జీ­ల­కు వె­ళ్తు­న్న వి­ద్యా­ర్థు­లే ఈ బస్సు­లో ఎక్కు­వ­గా ఉన్నా­రు. ప్ర­మా­దం­లో తీ­వ్రం­గా గా­య­ప­డిన మరి­కొం­ద­రు ప్ర­యా­ణి­కు­ల­ను స్థా­నిక ఆసు­ప­త్రు­ల­కు తర­లిం­చి చి­కి­త్స అం­ది­స్తు­న్నా­రు. పో­లీ­సు­లు, వి­ప­త్తు సహా­యక బృం­దా­లు జే­సీ­బీ సా­యం­తో కం­క­ర­ను తొ­ల­గిం­చి, సహా­యక చర్యల చే­ప­ట్టి మృ­త­దే­హా­ల­ను బయ­ట­కు తీ­శా­రు. అనం­త­రం మృ­త­దే­హా­ల­ను చే­వె­ళ్ల ప్ర­భు­త్వా­సు­ప­త్రి­కి తర­లిం­చా­రు. అక్కడ కు­ప్ప­లు­గా పడి ఉన్న మృ­త­దే­హాల చూసి వారి కు­టుంబ సభ్యు­లు గుం­డె­లు పగి­లే­లా రో­ధి­స్తు­న్నా­రు. కంకర ట్ర­క్కు మృ­త్యు శక­టం­లా దూ­సు­కొ­చ్చి.. అమా­య­కుల ప్రా­ణా­ల­ను బలి­గొ­న­డం తీ­వ్ర వి­షా­దా­న్ని నిం­పిం­ది. మరి­కా­సే­ప­ట్లో గమ్య­స్థా­నా­ని­కి చే­రు­కు­నే లోపే ఈ ఘోర ప్ర­మా­దం ఇరవై మం­ది­ని పొ­ట్టన పె­ట్టు­కుం­ది. ఈ ప్ర­మా­దం­లో ఆర్టీ­సీ బస్సు డ్రై­వ­ర్ తో పాటు కంకర ట్ర­క్కు డ్రై­వ­ర్ కూడా మర­ణిం­చా­డు. ఈ ప్ర­మాద దృ­శ్యా­లు అం­ద­రి­నీ కం­ట­త­డి పె­ట్టిం­చా­యి.


ఈ ప్ర­మా­దం­లో ఆప్తు­ల­ను కో­ల్పో­యిన వారు పె­డు­తు­న్న కం­ట­త­డి అం­ద­రి హృ­ద­యా­ల­ను పిం­డే­స్తోం­ది. బస్సు ప్ర­మా­దం­లో ఇద్ద­రు చి­న్నా­రు­లు అనా­థ­ల­య్యా­రు. మీ­ర్జా­గూడ సమీ­పం­లో ఆర్టీ­సీ బస్సు­ను టి­ప్ప­ర్‌ ఢీ­కొ­న్న ఘట­న­లో వి­కా­రా­బా­ద్‌ జి­ల్లా యా­లా­ల్‌ మం­డ­లం హా­జీ­పూ­ర్‌­కు చెం­దిన భా­ర్యా­భ­ర్త­లు బం­ద­ప్ప, లక్ష్మీ మృతి చెం­దా­రు. వారి పి­ల్ల­లు భవా­నీ, శి­వ­లీల ప్రా­ణా­ల­తో బయ­ట­ప­డ్డా­రు. ఘట­న­స్థ­లి­లో ని­ర్జీ­వం­గా పడి­వు­న్న తమ తల్లి­దం­డ్రు­ల­ను చూ­సు­కుం­టూ కన్నీ­రు­ము­న్నీ­రు­గా వి­ల­పిం­చా­రు. ఈ ఘోర ప్ర­మా­దం ఓ కు­టుం­బం­లో అం­తు­లే­ని వి­షా­దం నిం­పిం­ది. ఒకే తల్లి­కి పు­ట్టిన ము­గ్గు­రు అక్కా­చె­ల్లె­ళ్లు రో­డ్డు ప్ర­మా­దం­లో మర­ణిం­చా­రు. తాం­డూ­రు­లో­ని గాం­ధీ­న­గ­ర్‌­లో ని­వా­సం ఉండే ఎల్ల­య్య గౌ­డ్‌­కు ము­గ్గు­రు కు­మా­ర్తె­లు నం­ది­ని, సా­యి­ప్రియ, తనూష ఉన్నా­రు. వారు హై­ద­రా­బా­ద్‌­లో చదు­వు­తు­న్నా­రు. ఇటీ­వ­లే బం­ధు­వు­లు పె­ళ్లి ఉం­డ­టం­తో సొం­తూ­రి­కి వచ్చా­రు. వే­డు­క­ల­ను ము­గిం­చు­కొ­ని నగ­రా­ని­కి పయ­న­మైన వా­రి­ని మృ­త్యు­వు కబ­ళిం­చిం­ది.

Tags

Next Story