Chevella Lok Sabha: చేవెళ్ల బరిలో ముగ్గురు ముగ్గురే

Chevella Lok Sabha: చేవెళ్ల బరిలో ముగ్గురు ముగ్గురే
హాట్ సీట్ గా లోక్ సభ స్థానం

చేవెళ్ల లోక్‌సభ స్థానం ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి.బిఆర్ ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, బిజేపి నుంచి కొండావిశ్వేశ్వర్ రెడ్డి పోటీ పడుతుండగా కాంగ్రెస్ నుంచి పట్నం సునీతారెడ్డి బరిలో దిగేఅవకాశం ఉంది. అమె పేరును అధిష్ఠానం ఖరారు చేయాల్సిఉంది. చేవెళ్ల MP స్థానాన్నిఒకసారి కాంగ్రెస్ కైవసం చేసుకోగా రెండుసార్లు భారాస దక్కించుకుంది. ఐతే భాజపా తరపున బరిలో నిలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికని సవాల్‌గా తీసుకోగా కాంగ్రెస్, భారాసలు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ ఎన్నిక ఈసారి రసవత్తరంగా ఉండబోతుంది. ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడంతో త్రిముఖ పోటీ నెలకొంది. అధికార కాంగ్రెస్ నుంచిమాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి, వికారాబాద్ జిల్లా ZP ఛైర్మన్ సునీతా మహేందర్‌రెడ్డిపేరు దాదాపుగా ఖాయమైంది. ఆమె పేరు కాంగ్రెస్ అధికారికంగా ఖరారు ప్రకటించాల్సి ఉంది.ముందుగా కుదిరిన ఒప్పందం మేరకు సునీతారెడ్డి కుటుంబం ఇటీవల బిఆర్ ఎస్కి రాజీనామా చేసి హస్తం పార్టీలో చేరింది. తొలి జాబితాలో ఆమె పేరు ఉన్నాచివరి క్షణంలో పెండింగ్‌లో పెట్టారు. క్షేత్రస్థాయిలో ఆమె ప్రచారాన్ని మొదలుపెట్టారు. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి సతీమణిగానే కాకుండాక్షేత్రస్థాయిలో మంచి పేరు, గుర్తింపు సహా గత పరిచయాలు కలిసివస్తాయని నేతలు చెబుతున్నారు.

సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి మరోసారి పోటీకి ఆసక్తి చూపకపోవడంతో అభ్యర్థి కోసం భారాస నాయకత్వం పలుపేర్లు పరిశీలించింది. గతంలో అక్కడ నుంచి పోటీపడిన అనేక మంది సీనియర్లుమారిన రాజకీయ పరిస్థితులతో వెనకడుగు వేశారు. చివరకు తర్జనభర్జనపడి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ పేరును భారాస ఖరారు చేసింది. కాంగ్రెస్, తెదేపాలో పలుహోదాల్లోకాసాని పనిచేశారు. బాచుపల్లిలో సాధారణ కార్యకర్తగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్రస్థాయి వరకు సాగింది. గతేడాది తెదేపాకి రాజీనామా చేసి KCR సమక్షంలో గులాబీపార్టీలో చేరారు. జిల్లాలో బలమైన సామాజిక వర్గం ఉండటంతో కాసాని వైపు భారాస మొగ్గుచూపింది. ఆయన్ని గెలిపించే బాధ్యతను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీసుకున్నట్లు తెలుస్తోంది.

బిజేపి నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వశ్వర్‌రెడ్డి పోటీచేస్తున్నారు. 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలిచిన విశ్వశ్వర్‌రెడ్డి 2018లో రాజీనామా చేసి సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 2019లో మరోసారి ఎంపీగా పోటీచేశారు. స్వల్ప మెజార్టీతో భారాస అభ్యర్థి రంజిత్‌రెడ్డిపై ఓడిపోయారు. ఆ తర్వాత 2021లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విశ్వేశ్వర్‌రెడ్డి.. 2022లో భాజపాలో చేరారు. అనూహ్యంగా మరోసారి భాజపా నుంచి చేవెళ్ల ఎంపీ టికెట్ దక్కించుకున్న విశ్వేశ్వర్‌రెడ్డిఈసారి ఎన్నికను సవాల్‌గా తీసుకున్నారు.


Tags

Read MoreRead Less
Next Story