Muchintal: ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.. సాయంత్రం ముఖ్య అతిథుల సందేశాలు..
Muchintal: ముచ్చింతల్ దివ్యసాకేతంలో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ యాగశాలలో పరమేష్టి, వైభవేష్టి కార్యక్రమాలు జరగుతున్నాయి. తీవ్ర వ్యాధుల నివారణ కోసం పరమేష్టి, పితృదేవతాతృప్తి ద్వారా విఘ్న నివారణ కోసం వైభవేష్టి నిర్వహిస్తున్నారు. ప్రవచన మండపంలో శ్రీరామ అష్టోత్తర శతనామావళి పూజ జరగింది.
సింహాచలం వేదపండితులతో టీపీ రాఘవాచార్యుల ఆధ్వర్యంలో రామానుజ వైభవం ప్రవచన కార్యక్రమం, .వేద పండితుల ప్రవచనాలు జరిగాయి. ముచ్చింతల్ శ్రీరామనగరంలో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా సాతున్నాయి. 12 రోజులపాటు జరగనున్న ఈ మహాక్రతువు ఐదో రోజుకు చేరుకుంది. శ్రీరామనగరంలో జరగనున్న ఇవాళ్టి కార్యక్రమానికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరవుతారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమతామూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. పులువురు ప్రముఖులు సైతం శ్రీరామానుజాచార్య విగ్రహాన్ని దర్శించుకుంటున్నారు ఉత్సవాల్లో ప్రధాన ఘట్టంగా నిలిచి సమతామూర్తి విగ్రహావిష్కరణ ప్రధాని మోదీ చేతుల మీదుగా నిన్న అంగరంగ వైభవంగా జరిగింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com