Telangana Secretariat : నూతన సచివాలయంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

Telangana Secretariat : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతనంగా నిర్మిస్తున్న సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ సచివాలయానికి డా. బిర్. అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు సీఎం కేసీఆర్. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని పేరు సచివాలయానికి పెట్టుకుందామన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందన్నారు.
అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన భారతీయత అని చాటిన అంబేద్కర్ పేరును భారత నూతన పార్లమెంట్ భవనానికి కూడా పెట్టాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇదే విషయంపై ప్రధాని మోడీకి లేఖ రాయనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com