Malkajgiri: జీహెచ్‌ఎంసీ ట్రక్కు ఢీకొని చిన్నారి మృతి..

Malkajgiri: జీహెచ్‌ఎంసీ ట్రక్కు ఢీకొని చిన్నారి మృతి..
Malkajgiri: పెద్దవాళ్ల అజాగ్రత్తతో చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అభం శుభం తెలియని ఆ పసివాడు ఆడుకునేందుకు రోడ్డు మీదకు వచ్చాడు.

Malkajgiri: పెద్దవాళ్ల అజాగ్రత్తతో చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అభం శుభం తెలియని ఆ పసివాడు ఆడుకునేందుకు రోడ్డు మీదకు వచ్చాడు.. అప్పుడే జీహెచ్‌ఎంసీ ట్రక్కు వచ్చింది. చెత్తను సేకరించిన వ్యక్తి బాలుడిని చూసుకోకుండా ట్రక్కును ముందుకు పోనిచ్చాడు.. అంతే బాలుడి ప్రాణాలు చక్రాల కింద నలిగిపోయాయి. తెలంగాణలోని మల్కాజ్‌గిరిలో జీహెచ్‌ఎంసీ ట్రక్కు ఢీకొని పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. 18 నెలల బాలుడు రోడ్డుపై ఆడుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మల్కాజిగిరి మౌలా అలీ ఆర్టీసీ కాలనీలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన సీసీటీవీలో రికార్డై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫుటేజీలో, చెత్త సేకరిస్తున్న ఆటో ట్రాలీ డ్రైవర్ వాహనాన్ని వెనక్కి తిప్పే క్రమంలో చూశాడు.. అప్పటికే చిన్నారి చక్రాల కింద నలిగిపోయాడు. అనుకోని ఈ హఠాత్ పరిణామానికి ఆందోలన చెందిన ట్రక్ డ్రైవర్ అదాటున ఆటో దిగి పిల్లవాడి దగ్గరకు పరుగున వచ్చాడు.. పసిబిడ్డను ఎత్తుకుని బాలుడి ఇంట్లోకి పరుగెత్తాడు. తీవ్రంగా గాయపడిన పసిబిడ్డను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, కొద్దిసేపటికే మృతి చెందినట్లు ప్రకటించారు వైద్యులు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ట్రక్ డ్రైవర్‌ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story