సినిమా సీన్‌ను తలపించే రేంజ్‌లో ఆగిపోయిన పెళ్లి

సినిమా సీన్‌ను తలపించే రేంజ్‌లో ఆగిపోయిన పెళ్లి
X

సినిమా సీన్‌ను తలపించే రేంజ్‌లో నాటకీయ పరిణాలమాల మధ్య పీటల మీదకు వచ్చిన పెళ్లి పెటాకులయ్యింది. సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ ప్రాంతంలోని ఓ చర్చ్‌ ఆడిటోరియంలో.. జనగాం జిల్లా యశ్వంతపూర్‌కు చెందిన అనిల్‌తో అడ్డగుట్టకు చెందిన యువతితో పెళ్లి జరగాల్సి ఉంది. కొద్ది క్షణాల్లో పెళ్లి జరగనుందనగా తీవ్ర పరిణామాల మధ్య ఆగిపోయింది. యశ్వంతపూర్‌కు చెందిన యువతి వచ్చి అనిల్‌ తనను ప్రేమించి... మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యడంటూ గొడవ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమెను ప్రేమించినట్లు ఆధారాలు లేకపోవడంతో తామేమి చేయలేమని పోలీసులు చెప్పి వెనుదిరిగారు.

ఈ ఘర్షణలు ఉండగానే పెళ్లి కుమార్తె మైనర్‌ అంటూ కొంత మంది చైల్డ్‌లైన్‌ అధికారులకు ఎవరో ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి పెళ్లి కుమార్తె మైనర్‌ అని తేల్చారు. మేజర్‌ కావడానికి మరో మూడు నెలలు సమయం ఉందని తేల్చారు. ICDS, చైల్డ్‌లైన్‌ అధికారులు మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా నాటకీయ పరిణామాల మధ్య ఆ పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కోసం వచ్చిన బంధువులందరూ వెనుదిరిగారు.

Tags

Next Story