CHINA MANZA: ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా

CHINA MANZA: ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా
X
నిషేధం విధించినా ఆగని విక్రయాలు...అమ్మేవారి గురించి చెప్తే 5వేలు

హైదరాబాద్ నగరంలో నిషేధితమైన చైనీస్ మాంజా మరోసారి అమాయక ప్రాణాన్ని బలి తీసుకునేంత వరకు వెళ్లింది. గాలిపటం ఎగురుతున్న సమయంలో రోడ్డుపైకి వచ్చిన చైనీస్ మాంజా ఓ మైనర్ బాలుడి మెడను కోసి వేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు 22 కుట్లు వేసి ప్రాణాలను కాపాడారు. అత్యంత విషమ పరిస్థితుల్లో చికిత్స పొందిన బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన నగర ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. నిషేధం ఉన్నప్పటికీ చైనీస్ మాంజా ఎలా బహిరంగంగా వినియోగంలో ఉందన్న ప్రశ్నలు మళ్లీ తలెత్తుతున్నాయి. చైనీస్ మాంజా ప్రమాదాలపై రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎన్నోసార్లు హెచ్చరించినా పరిస్థితి మారడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ అంశంపై 21 సార్లకు పైగా హెచ్చరికలు చేశారు. అయినా అక్రమ తయారీ, విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయని కుటుంబ సభ్యులు గుర్తు చేస్తున్నారు.

అమ్మేవారి గురించి చెప్తే 5వేలు

మనుషులు, మూగ జీవాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న చైనా మాంజాను ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని చోట్ల విక్రయాలు జరుగుతుండటంతో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక ప్రకటన చేశారు. చైనా మాంజా అమ్ముతున్న వారి సమాచారం ఇస్తే వారికి రూ.5 వేలు ఇస్తామని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.

Tags

Next Story