chinna jeeyar swamy : వనదేవతలని నేను కించపరచలేదు : చినజీయర్ స్వామి

chinna jeeyar swamy : గ్రామదేవతలను తాను ఎప్పుడు దురుద్దేశంపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు త్రిదండి చినజీయర్ స్వామి. రెండ్రోజులుగా ఆయనపై వచ్చిన విమర్శలపై స్పందించారు జీయర్ స్వామి. కొందరు సొంత లాభం కోసమే వివాదం చేస్తున్నారని తప్పుబట్టారాయన. తమకు కులం, మతం అనే తేడా లేదని చెప్పారు. అందరిని గౌరవించాలనేది తమ విధానమన్నారు. కొందరు పనిగట్టుకుని సమస్యగా మారుస్తున్నారని, సమాజ హితం లేనివారే ఇలాంటి అల్పప్రచారం చేస్తున్నారన్నారు జీయర్‌స్వామి. విషయం తెలుసుకోకుండా ఆరోపణలు చేసేవారిపై జాలిపడాల్సి వస్తుందన్నారు.
ఒకరిని లేదా, కొంతమంది దేవతలను చిన్న చూపు చూసేలా మాట్లాడానని అనుకోవడం పొరపాటన్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా మాట విన్నప్పుడు, ఒక నిర్ణయం చేసేటప్పుడు దానికి పూర్వాపరాలు చూడటం చాలా అవసరమన్నారు. అది లేకుండా మధ్యలో కొంత భాగాన్ని తీసుకుని వివాదం చేయడం హాస్యాస్పదంగా ఉంటుందన్నారు జీయర్ స్వామి. 20 ఏళ్ల కింద అన్నమాటలపై ఇప్పుడు వివాదం సృష్టిస్తున్నారన్నారు.
రాజకీయాల్లో వెళ్లాలనే కోరిక లేదన్నారు చినజీయర్ స్వామి.రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన గతంలోనూ రాలేదని, ఎప్పటికీ రాదన్నారు. మాలాంటి వాళ్లు... సమాజానికి కళ్లలాంటి వారన్నారు. నడుస్తుంటే కాళ్లలో ఏం దిగుతుంతో చెప్పడం మా బాధ్యత అన్నారు. ఎవరైనా సలహా అడిగితే చెబుతామన్నారు జీయర్ స్వామి.. సమతామూర్తి ప్రాంగణంలో ఎంట్రీ ఫీజుపైనా స్పందించారు చిన్నజీయర్ స్వామి.
దర్శనం కోసం, పూజల కోసం ఎలాంటి రుసము తీసుకోవడం లేదన్న ఆయన.. విశాలమైన ఈ ప్రాంగణ నిర్వహణకోసం మాత్రమే 150 రూపాయలు తీసుకుంటున్నామన్నారు. ఇలాంటి ప్రాంగణాలకు టికెట్లు వేలలో ఉంటాయన్నారు. ప్రసాదాలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com