Alai Balai : అలయ్ బలయ్.. డప్పుకొట్టి, డ్యాన్స్ చేసిన చిరు..

Alai Balai: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి... మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వయంగా చిరు ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. దత్తాత్రేయ ఆహ్వానాన్ని అంగీకరించి అలయ్‌బలయ్‌కు హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవీ. ఈ సందర్భంగా... డప్పు కొట్టి అలరించారు చిరంజీవి. అంతకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సైతం ఈ కార్యక్రమంలో సందడి చేశారు. డప్పు కొట్టడంతో... పాటు డాన్స్ వేశారు.
పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు, ప్రముఖులు అలయ్ బలయ్‌కు హాజరయ్యారు. 2005లో గవర్నర్ బండారు దత్తాత్రేయ మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన తనయ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ వంటలు రుచి చూపించనున్నారు. ఏటా దసరా సందర్భంగా అలయ్.. బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
సూపర్‌హిట్ కొట్టిన మరుసటి రోజే ఇక్కడికి వచ్చాను
గాడ్‌ఫాదర్‌ను సూపర్‌హిట్ చేసిన అందరికీ ధన్యవాదాలు
గత ఏడాది మా తమ్ముడికి అవకాశం వచ్చింది
దత్తన్న దృష్టిలో ఎందుకు పడలేదని అనుకున్నా
అలయ్ బలయ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది
అలయ్ బలయ్ ఎంతో గొప్ప కార్యక్రమం
రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం ఇది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com