Cinema: ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్ కోసమే... కమర్ ఫిల్మ్ ప్యాక్టరీ

Cinema: ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్ కోసమే... కమర్ ఫిల్మ్ ప్యాక్టరీ
ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోకి ప్రవేశిస్తున్న యువ వ్యాపారవేత్త కమర్‌

ఫ్యాషన్ టీవీ ఇండియా, బాక్స్ క్రికెట్ లీగ్, ఫిల్మ్ ఫేయిర్ లాంటి సంస్థలను ద్విగిజయంగా నడుపూతూ వ్యాపార రంగంలో దూసుకుపోతున్న యువ వ్యాపారవేత్త కమర్‌ ఇప్పుడూ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఓటీటీ ప్లాట్‌ఫాంను స్థాపించారు. అంతర్జాతీయ స్థాయిలో మంచి నిర్మాణ విలువలతో ప్రేక్షకులను అలరించడానికి తాజాగా కమర్ ఫిల్మ్ ఫ్యాక్టరిని ప్రారంభించాడు. ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో తన వ్యాపారాన్ని భారతదేశం మొత్తం విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం హైదరాబాదులోని ఓ ప్రముఖ హోటల్లో కమర్ ఫిలిం ఫ్యాక్టరీని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమర్‌ మాట్లాడుతూ ప్రేక్షకుల కోసం అంతర్జాతీయ విలువలతో మంచి సినిమా కంటెంట్లను ప్రోత్సహించడానికి ఈ సంస్థను స్థాపించడం జరిగిందన్నారు. కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ, మళియాలంలో సినిమాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో సినిమా తీయాలనుందని కమర్‌ తన కోరికను వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story