పండక్కి సిటీల నుంచి పల్లెబాట పడుతున్న జనం!

పండక్కి సిటీల నుంచి పల్లెబాట పడుతున్న జనం!
పండక్కి సిటీల నుంచి అందరూ పల్లెబాట పడుతున్నారు. దీంతో.. హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.

పండక్కి సిటీల నుంచి అందరూ పల్లెబాట పడుతున్నారు. దీంతో.. హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. సంక్రాంతికి మూడ్రోజుల ముందు నుంచే ఇలా భారీగా జనం సొంతఊళ్లకు వెళ్తుండడంతో.. టోల్‌గేట్‌ల వద్ద ట్రాఫిక్‌జామ్‌ కనిపిస్తోంది. చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్ వద్ద భారీ క్యూ నిన్నటి నుంచే ఉంది. ఏపీలోని పలు టోల్‌గేట్ల వద్ద ఇదే సీన్ కనిపిస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నవారితో జాతీయ రహదారులపై కార్లు బాగా పెరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని కలపర్రు టోల్‌గేట్ దాటాలంటే అరగంట నుంచి 40 నిమిషాల వరకూ పైగా సమయం పడుతోంది.

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి చోట్ల నుంచి సంక్రాంతికి ఊరు వెళ్లేవాళ్లు ఈసారి తక్కువ మందే ఉన్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వడంతో చాలా మంది వారి స్వస్థలాల్లోనే ఉన్నారు. ఐతే.. కరోనా వల్ల పూర్తిస్థాయిలో రైళ్లు, బస్సులు లేకపోవడంతో.. ఇప్పుడు పండక్కి ఊళ్లకు వెళ్లేవాళ్లు అంతా సొంత వాహనాల్లోనే ప్రయాణం అవుతున్నారు. టోల్‌గేట్ల వద్ద రద్దీ కనిపించడానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు. అటు, ప్రైవేట్ ట్రావెల్స్ అయినా అద్దెకు తీసుకునే ట్యాక్సీలైనా డబుల్ ఛార్జీలతో జనాల్ని బాదేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story