CM KCR : 70 కేజీల కేక్ తో సంబరాలు

సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. 70 కేజీల భారీ కేక్‌ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఓ అంబులెన్స్‌ను గిఫ్ట్‌గా అందించారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా వికలాంగులకు ట్రై సైకిల్స్ అందించారు. కలెక్టరేట్ ఆవరణలో మొక్క నాటి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు జగదీశ్ రెడ్డి. సాధ్యాన్ని సుసాధ్యం చేసిన కారణజన్ముడిగా కేసీఆర్‌ను అభివర్ణించారు
ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వరంలో పార్టీ శ్రేణులు బర్త్‌డే సంబరాలు జరుపుకున్నారు. తాతా మధుసూదన్ కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని తాతా మధుసూదన్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com