కేసీఆర్‌ దత్త పుత్రిక ప్రత్యూష పెళ్లి సందడి.. పెళ్లికూతురిని చేసిన సీఎం సతీమణి

కేసీఆర్‌ దత్త పుత్రిక ప్రత్యూష పెళ్లి సందడి.. పెళ్లికూతురిని చేసిన సీఎం సతీమణి
X
సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ పాల్గొని నవవధువుకు పట్టుబట్టలు, డైమండ్ నెక్లెస్ పెట్టి ఆశీర్వదించారు.

సీఎం కేసీఆర్‌ దత్త పుత్రిక ప్రత్యూష పెళ్లి సందడి మొదలైంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామం లూర్ధుమాత చర్చిలో చరణ్‌రెడ్డితో ఇవాళ ఉదయం 10 గంటలకు పెళ్లి జరగనుంది. వివాహాన్ని వైభవంగా జరిపించేందుకు మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఆదివారం మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు, ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ సభ్యులు ప్రత్యూషను పెళ్లి కుమార్తెను చేశారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ సైతం పాల్గొని నవవధువుకు పట్టుబట్టలు, డైమండ్ నెక్లెస్ పెట్టి ఆశీర్వదించారు. గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా అభివృద్ధి కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఐఏఎస్‌ అధికారి దివ్య దేవరాజ్‌ పర్యవేక్షణలో జరిగే ఈ వివాహానికి పలువురు మంత్రులతో పాటు ఐఏఎస్‌ అధికారులు హాజరు కానున్నారు.



Tags

Next Story