Harish Rao: తెలంగాణ వైద్యశాఖకు 466 కొత్త వాహనాలు

తెలంగాణ వైద్యశాఖకు 466 కొత్త వాహనాలుఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి హరీష్ రావు. 108 ఉద్యోగులకు 4 స్లాబులుగా వేతనాల పెంపు ఉంటుందని ప్రకటించారు. ఇకపై ఆశావర్కర్లకు సెల్‌ఫోన్ బిల్లు లనూ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని.. వారికి స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో స్కామ్‌లు ఉంటే.. తెలంగాణలో స్కీమ్‌లు ఉన్నాయని చెప్పారు. అయితే ఎన్నికల్లో ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు.
అంతకుముందు హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో 466 అమ్మ ఒడి, అంబులెన్స్, పార్థివదేహాల తరలింపు వాహనాల్ని సీఎం కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 204 అంబులెన్స్‌లు, 228 అమ్మ ఒడి వాహనాలు, 34 హర్సె వెహికిల్స్ ఉన్నాయి. కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ వాణీ దేవి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com