సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణయం : సీఎంవో సెక్రట‌రీగా రాహుల్ బొజ్జా!

సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణయం : సీఎంవో సెక్రట‌రీగా రాహుల్ బొజ్జా!
X
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ద‌ళితబంధు ప‌థ‌కం ప్రారంభోత్సవ వేదిక‌పై సీఎంవో సెక్రట‌రీగా రాహుల్ బొజ్జాను నియ‌మిస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ద‌ళితబంధు ప‌థ‌కం ప్రారంభోత్సవ వేదిక‌పై సీఎంవో సెక్రట‌రీగా రాహుల్ బొజ్జాను నియ‌మిస్తున్నట్లు ప్రకటించారు. రాహుల్ బొజ్జా ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ‌ శాఖ సెక్రట‌రీగా ఉన్నారు. రాహుల్ బొజ్జా ద‌ళితుడే. వాళ్ల నాన్న బొజ్జా తార‌కం.. ఉద్యమంలో ప‌ని చేసిన వారికి న్యాయవాదిగా పనిచేశారు. ఆయన కుమారుడే రాహుల్ బొజ్జా.. ఎస్సీ సంక్షేమ‌ శాఖ సెక్రట‌రీగానే కాకుండా సీఎంవో సెక్రట‌రీగా కూడా ఉండాలని నిర్ణయం తీసుకునట్టుగా కేసీఆర్ తెలిపారు. రేప‌ట్నుంచి సీఎంవో కార్యాల‌యంలో రాహుల్ బొజ్జా సెక్రట‌రీగా ఉంటారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాగా రాహుల్ బొజ్జా ఐఏఎస్ అధికారి. 2000 బ్యాచ్ కి చెందినవారు.

Tags

Next Story