CM KCR : వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేరు మార్పు: కేసీఆర్

CM KCR : వరంగల్‌పై వరాల వర్షం కురిపించారు ముఖ్యమంత్రి కేసీఆర్.. వరంల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా మార్చుతామని చెప్పారు.. దీనిపై త్వరలో ఉత్తర్వులు ఇస్తామన్నారు. కలెక్టర్ పేరు కూడా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే వరంగల్‌కు డెంటల్ కాలేజీతోపాటు ఆస్పత్రిని కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.. వరంగల్‌లో పలు భవనాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ బిల్డింగ్‌లో తొలి ప్రెస్‌మీట్ పెట్టారు.
అత్యాధునిక సౌకర్యాలతో సమీకృత కలెక్టర్ భవన సముదాయం నిర్మించినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమిపూజ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఏడాదిన్నరలోగా ఆస్పత్రి నిర్మాణం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.. హైదరాబాద్ ఈర్ష్యపడేలా నగరం అభివృద్ధి చెందాలన్నారు. తూర్పు తెలంగాణకు వరంగల్ కేంద్రం కావాలన్నారు కేసీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com