తెలంగాణ

సీఎం పుట్టిన రోజు స్పెషల్.. అమ్మవారికి బంగారు చీర

మృత్యుంజయ హోమం, ఆయుష్షు హోమం, అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాలు

సీఎం పుట్టిన రోజు స్పెషల్.. అమ్మవారికి బంగారు చీర
X

ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆ రోజు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి 2.5 కేజీల బంగారంతో తయారు చేసిన చీరను బహుకరిస్తారు. ఉదయం ఆరు గంటలకు అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం, తొమ్మిది గంటలకు మృత్యుంజయ హోమం, ఆయుష్షు హోమం, అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అలాగే ఉజ్జయినీ మహంకాళి, సికింద్రాబాద్ గణేష్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. దాతల సహకారంతో అమ్మవారికి బంగారు చీరను సమర్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Next Story

RELATED STORIES