ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయి: సీఎం కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలన తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. దేశంలో ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రాల అధికారాలను లాక్కోవాలని చూడటం దా రుణమన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా కేంద్రం లెక్కచేయడం లేదని మండిపడ్డారు. ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం ఆర్డినెన్స్‌పై పోరాడతామన్నారు సీఎం కేసీఆర్.
కేంద్రం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం ఆర్డినెన్స్ తేవడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ అధికారుల విషయంలో ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేస్తోందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కనపెట్టేసి ఆర్డినెన్స్ తేవడం అంటే న్యాయం కోసం ప్రజలు ఎక్కడికి వెళ్తారని క్వశ్చన్ చేశారు. ఇది ఢిల్లీ ప్రజల సమస్య కాదు, దేశ ప్రజల సమస్య అన్నారు కేజ్రీవాల్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com