CM KCR : ఆరు రోజులుగా ఢిల్లీలోనే సీఎం కేసీఆర్‌ ..!

CM KCR  : ఆరు రోజులుగా ఢిల్లీలోనే సీఎం కేసీఆర్‌ ..!
ఆరో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్‌... కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆరో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్‌... కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిశారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు సహకరించినందుకు నితిన్‌ గడ్కరీకి సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు, జాతీయ రహదారుల నిర్మాణానికి నిధుల కేటాయింపు వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌తో పాటు... మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌ రెడ్డి, లోక్‌ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీ బీబీ పాటిల్‌ కూడా ఉన్నారు. ఇక రాత్రి 7 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేందర్‌ షెకావత్‌ను కలవనున్నారు సీఎం కేసీఆర్‌. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదంపై చర్చించే అవకాశం ఉంది. కృష్ణా జలాల పంపకాలలో 50 శాతం వాటా కోరే అవకాశం కనిపిస్తోంది.

Tags

Next Story