అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖకి సీఎం కేసీఆర్‌ ఆదేశాలు..!

అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖకి  సీఎం కేసీఆర్‌ ఆదేశాలు..!
X
అలాగే.. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ..మానిటర్‌ చేయాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు.

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్ వేళ సర్కార్‌ మరిన్ని కట్టడి చర్యలు తీసుకుంటోంది. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి.. హోమ్ ఐసోలేషన్‌ కిట్స్‌ అందించాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అలాగే.. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ..మానిటర్‌ చేయాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. మరోవైపు.. ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ అప్రమత్తమైంది. కరోనా పేషెంట్లతో నిండి ఉన్న ఆస్పత్రుల్లో.. అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం కేసీఆర్‌. గాంధీ, టిమ్స్‌ లాంటి పేషెంట్లు ఎక్కువగా ఉన్న..ఆస్పత్రుల్లో ఫైర్‌ ఇంజన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు.

Tags

Next Story