CM KCR Health: ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కేసీఆర్..

CM KCR Health: ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కేసీఆర్..
X
CM KCR Health Update: ముఖ్యమంత్రి కేసీఆర్ యశోదా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

CM KCR Health: ముఖ్యమంత్రికేసీఆర్ యశోదా ఆస్పత్రినుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అన్ని టెస్టుల్లో నార్మల్ రిపోర్టు రావడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఎడమ చేయినొప్పితోపాటు..గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో ఆయన ఈ ఉదయం సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రికి వెళ్లారు. అయితే ప్రాథమిక వైద్యపరీక్షల అనంతరం వైద్యులు సిటీస్కాన్, యాంజియోగ్రామ్ టెస్టులుచేశారు. అందులో ఎలాంటి ప్రాబ్లమ్ లేదని, అంతా నార్మల్‌గానే ఉందని తెలిపిన వైద్యులు,... కొంతసేపు అక్కడే ఉంచారు. ఆస్పత్రి తొమ్మిదవ ఫ్లోర్‌లోని గదిలో అడ్మిట్‌ చేసిన వైద్యులు మరిన్ని పరీక్షలు నిర్వహించారు. కాసేపటిక్రితం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు.

స్వల్ప అస్వస్థత కారణంగా ఉదయం యశోద హాస్పిటల్‌కు వచ్చారు సీఎం కేసీఆర్. కేసీఆర్ వెంట ఆయన భార్య శోభ, కూతురు కవిత హాస్పిటల్‌కు వచ్చారు. తర్వాత ఆయనకు రెగ్యూలర్ పరీకలు నిర్వహించారు వైద్యులు. కేసీఆర్‌ హాస్పిటల్‌కు వెళ్లారన్న విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌...రామంతపూర్‌లో పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన యశోదకు చేరుకున్నారు. మంత్రి హరీష్‌ కూడా అసెంబ్లీ నుంచి హాస్పిటల్‌కు వచ్చారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

Tags

Next Story