జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి హోదాలో వరుసగా పదోసారి జాతీయ జెండాను ఆవిష్కరించారు కేసీఆర్. గోల్కొండలో జరిగిన 77వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించిన కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కేసీఆర్‌ ప్రసంగించారు.దేశం ఆశించిన లక్ష్యాలను ఇంకా చేరుకోలేదని,దేశంలో వనరులు చాలా ఉన్నాయని అన్నారు.పాలకుల అసమర్థతతో వాటిని వినియోగించడం లేదని అన్నారు.సమైక్య పాలనలో అన్ని రంగాలు విధ్వంసానికి గురయ్యాయని,తెలంగాణ తీవ్రమైన దోపిడీకి గురైందన్నారు కేసీఆర్‌.విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని,అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే స్వాతంత్ర్యం వచ్చినట్లు అని అన్నారు.తెలంగాణలో కరెంట్‌ కోతలు లేకుండా చేశామని,9 ఏళ్లలో సంపద పెంచి.. పేదలకు పంచామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story