తెలంగాణ

వైరల్ గా మారిన హిమాన్షు ట్వీట్.. లక్ష్యాలు వేరంటూ పోస్ట్..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ గా మారిన హిమాన్షు ట్వీట్..  లక్ష్యాలు వేరంటూ పోస్ట్..!
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని మంగళవారం హిమాన్షు ట్విట్టర్ లో పేర్కొన్నాడు. జులై 12న 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న హిమాన్షు.. తన ఆకాంక్ష, లక్ష్యాలు వేరని ట్విటర్‌ వేదికగా తెలిపాడు. లక్ష్యాలు సాధించుకోవడంపైనే దృష్టి పెడుతున్నానని, రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. ఇక తన బర్త్‌డేకి ఎవరికీ పూల బొకేలు పంపొద్దని, దానికి బదులు మొక్కలు నాటలని హిమాన్షు కోరాడు.


Next Story

RELATED STORIES