బీసీలపై కేసీఆర్ వరాల జల్లు.. లక్ష రూపాయల గ్రాంట్

బీసీలపై కేసీఆర్ వరాల జల్లు..  లక్ష రూపాయల గ్రాంట్
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది బీఆర్‌ఎస్‌ సర్కారు.

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది బీఆర్‌ఎస్‌ సర్కారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ బీసీ లకు లక్ష రూపాయల సహాయంతో పాటు రెండో విడత గొర్రెల పంపిణీని మంచిర్యాలలో ప్రారంభిస్తారు. నిరుపేదలకు ఇళ్ళ స్థలాలను కూడా పంపిణీ చేయనున్నారు. కులవృత్తులలో ఉన్నవారికి ఆర్ధిక సహాయం అందించి వారిని ప్రోత్సహించాలనే ఉద్ధ్యేశ్యంతో ప్రభుత్వం బ్యాంకు లింకేజీ లేకుండా లక్ష రూపాయల గ్రాంటును అందిస్తారు. విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులవృత్తులు, చేతివృత్తుల‌నే నమ్ముకొని జీవిస్తున్న వారికి లక్ష వరకు ఆర్థిక సాయం అందిస్తారు. రోజుకు కనీసం 50 యూనిట్లు గ్రౌండ్ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులను గుర్తించి ప్రతినెలా 15వ తేదీన ఎమ్మెల్యేలతో చెక్కులు పంపిణీ చేస్తారు. ఈ పథకం కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు స్వీకరించనున్నారు

గొర్రెల పెంపకం వృత్తిగా జీవనం సాగిస్తున్న గొల్ల, కురుమలు ఆర్దికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో సుమారు 11 వేల కోట్ల రూపాయల వ్యయంతో గొర్రెల యూనిట్ల పంపిణీని చేపట్టింది. స్పెషల్ డ్రైవ్ చేపట్టి అర్హులైన గొల్ల, కురుమలను గుర్తించి గొర్రెల పెంపకం దారుల సొసైటీలలో సభ్యత్వం కల్పించింది. వీరికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు కలిపి ఒక యూనిట్ గా, ఒక్కో యూనిట్ ధరను ఒక లక్ష 25 వేల రూపాయలుగా నిర్ణయించారు. తొలి విడతలో 5 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు 4 లక్షల మంది లబ్దిదారులకు పంపిణీ చేశారు. గొర్రెల ధరలు పెరిగిన కారణంగా రెండో విడతలో లక్ష 75 వేల రూపాయలు చేసింది. లబ్దిదారులకు గొర్రెల యూనిట్ తో పాటు గొర్రెల కు ఇన్సురెన్స్ సౌకర్యం కల్పిస్తుంది. కేసీఆర్ స్వయంగా ఇవాళ సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆసరా పింఛన్స్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు అర్ధం అయ్యేలా, నియోజకవర్గల వారిగా ఎంతమందికి పెన్షన్ ఇచ్చారో ఎంత ఖర్చు చేశారో లెక్కలతో వివరిస్తారు.

Tags

Next Story