బ్రాహ్మణులపై CM KCR వరాల జల్లు

బ్రాహ్మణులపై CM KCR వరాల జల్లు
వేద పండితులకు ఇస్తున్న గౌరవ భృతిని 5 వేల రూపాయలకు పెంచారు

బ్రాహ్మణులపై CM KCR వరాల జల్లు కురిపించారు. వేద పండితులకు ఇస్తున్న గౌరవ భృతిని 5 వేల రూపాయలకు పెంచారు. ధూప-దీప నైవేద్యం పథకం కింద నెలకు ఇచ్చే నిధులను 10 వేల రూపాయలకు పెంచారు. బ్రాహ్మణుల్లో చాలా మంది పేదలు ఉన్నారన్నారు. బ్రాహ్మణ పరిషత్‌కు ఏటా వంద కోట్లు కేటాయిస్తున్నట్లు CM KCR ప్రకటించారు.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో 6.10 ఎకరాల్లో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదన్‌ను CM KCR ప్రారంభించారు. బ్రాహ్మణ సదన్‌ను నిర్మించడం దేశంలో మొదటిసారి అని అన్నారు. బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న KCR.. వేదశాస్త్ర విజ్ఞాన బాండాగారంగా బ్రాహ్మణ సదన్ విలసిల్లాలని ఆకాంక్షించారు.

Tags

Next Story