CM KCR Health: సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు..

CM KCR Health: సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు యశోధ వైద్యులు. ఎడమ చేయి నొప్పిగా ఉందని ఉదయం చెప్పడంతో హాస్పిటల్ రావాలని సూచించినట్లు చెప్పారు. ఎడమ చేయికి నొప్పి కారణంగా యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించామన్నారు. ఐతే ఎలాంటి కార్డియో సమస్యలు లేవని క్లారిటీ ఇచ్చారు. వయసు రీత్యా నెక్ లో స్పాండిలోసిస్ వచ్చి ఉంటుందన్నారు వైద్యులు. వారం రోజుల పాటు కేసీఆర్‌కు విశ్రాంతి అవసరమన్నారు. కాసేపట్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు.
అస్వస్థతగా ఉండడంతో ఉదయం యశోద హాస్పిటల్‌కు వచ్చారు సీఎం కేసీఆర్. కేసీఆర్ వెంట ఆయన భార్య శోభ, కూతురు కవిత. ఎంపీ సంతోష్ రావు హాస్పిటల్‌కు వచ్చారు. తర్వాత ఆయనకు రెగ్యూలర్ పరీకలు నిర్వహించారు వైద్యులు. కేసీఆర్ హాస్పిటల్‌కు వెళ్లారన్న విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్...రామంతపూర్‌లో పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన యశోదకు చేరుకున్నారు. మంత్రి హరీష్ కూడా అసెంబ్లీ నుంచి హాస్పిటల్‌కు వచ్చారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com