CM KCR: రేపు మునుగోడులో కేసీఆర్ భారీ బహిరంగ సభ

CM KCR: సీఎం కేసీఆర్ రేపు మునుగోడులో బహిరంగ సభ పెడుతున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం తరువాత ప్రజల మధ్యకు వస్తున్న సీఎం కేసీఆర్.. రేపటి సభలో ఎలాంటి బాంబులు పేల్చుతారోనన్న ఉత్కంఠ నెలకొంది.
బీజేపీ పెద్దలు, కొందరు కేంద్ర మంత్రులే లక్ష్యంగా రేపటి సభలో విరుచుకుపడతారని తెలుస్తోంది. ఫామ్‌హౌస్ ఘటనలో అందరికీ తెలియని కొన్ని నిజాలను, కోణాలను సీఎం కేసీఆర్ బయటపెడతారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ లక్ష్యంగా జాతీయ పార్టీ పెట్టిన సీఎం కేసీఆర్.. ఫామ్‌హౌస్ డీల్‌ను నేషనల్ లెవెల్‌కు తీసుకెళ్లి జాతీయ స్థాయిలో బీజేపీని ఇరుకునపెట్టాలనే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఫామ్‌హౌస్ డీల్‌పై మూడు రోజులుగా మౌనంగా ఉంటున్నారు సీఎం కేసీఆర్. కాకపోతే, ఈ ఘటనపై వరుస సమీక్షలు చేస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుతోనూ ఈ డీల్‌పై చర్చించారు.
మరోవైపు పోలీసులు కూడా సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు ఆడియోలు విడుదలయ్యాయి. మరో రెండు ఆడియోలతో పాటు ఓ వీడియో కూడా పోలీసుల వద్ద ఉందని చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com