Huzurabad KCR : ఈ నెల 27న హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారానికి సీఎం కేసీఆర్‌..!

Huzurabad KCR : ఈ నెల 27న హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారానికి  సీఎం కేసీఆర్‌..!
X

KCR(Tv5news.in)

Huzurabad KCR : హుజురాబాద్‌లో ఉప ఎన్నిక ప్రచారం మరింత స్పీడందుకుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈనెల 27న ప్రచారానికి గడువు ముగియనుండటంతో.... అభ్యర్థులంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Huzurabad KCR : హుజురాబాద్‌లో ఉప ఎన్నిక ప్రచారం మరింత స్పీడందుకుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈనెల 27న ప్రచారానికి గడువు ముగియనుండటంతో.... అభ్యర్థులంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ తరఫున ఇప్పటికే మంత్రులు ప్రచారం నిర్వహిస్తుండగా... ఇప్పుడు సీఎం కేసీఆర్‌ కూడా రంగంలోకి దిగనున్నారు. ప్రచారం ముగింపు రోజునే భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే సభను హుజురాబాద్‌ నియోజకవర్గంలో పెడతారా...? లేక సమీప ప్రాంతాల్లో ఉంటుందా అనేది మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ఏది ఏమైనా హుజురాబాద్‌లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది.

Tags

Next Story