సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్!

కొత్త సచివాలయానికి సంబంధించిన నిర్మాణ పనులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిథులతో మాట్లాడారు. నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. ప్రధాన గేట్ తో పాటు, ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలను, భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు. డిజైన్లను పరిశీలించారు. సీఎం వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, కొప్పుల ఈశ్వర్, అధికారులు తదితరులున్నారు. కాగా రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనులను ముంబైకి చెందిన షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ దక్కించుకున్న విషయం విదితమే. ఈ నిర్మాణాన్ని సుమారుగా రూ.617 కోట్లతో నిర్మిస్తున్నారు.
కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిథులతో మాట్లాడారు. నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. pic.twitter.com/YmcIWcnPa1
— Telangana CMO (@TelanganaCMO) January 26, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com