గులాబీ పార్టీలో ఆరని జ్వాల.. ఆశావహుల్లో చల్లారని అసంతృప్తి

గులాబీ పార్టీలో టికెట్ల ప్రకటన తరువాత తలెత్తిన జ్వాలలు ఇంకా ఆరలేదు.ఆశావహుల్లో అసంతృప్తి చల్లారలేదు. టికెట్ దక్కని సీనియర్లు రగిలిపోతున్నారు. పాలేరులో పోటీ చేసి తీరుతానంటున్నారు మాజీ మంత్రి తుమ్మల తుమ్మల నాగేశ్వర రావు. నిన్న తన అనుచరులతో భారీ ర్యాలీతో బలప్రదర్శన నిరూపించుకున్నారు. మరోవైపు ఆయా నియోజక వర్గాల్లో అభ్యర్ధులకు అసంతృప్తి నేతల భయం పట్టుకుంది.
స్టేషన్ ఘన్‌పూర్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైయ్యారు ఎమ్మెల్యే రాజయ్య. ఇటు జనగామలో పోటీకి రెడీ అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. గ్రేటర్ పరిధిలోని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అధిష్టానంపై గుర్రగా ఉన్నారు. సీఎం కేసీఆర్ ఫోన్ చేసినా ఆయన శాంతించలేదు. మరోవైపు ములుగులో బడే నాగజ్యోతికి వ్యతిరేకంగా పోటీకి రెడీ అయ్యారు మాజీ మంత్రి చందులాల్ కుమారుడు ప్రహ్లాద్.
దాదాపు 50 నియోజక వర్గాల్లో రెబల్ అభ్యర్ధులుగా బరిలోకి దిగనున్నారు అసంతృప్త నేతలు.అయితే టికెట్ల ప్రకటన తరువాత జిల్లాల వారీగా అభ్యర్ధులను.. పిలుపించుకొని మాట్లాడుతున్నారు సీఎం కేసీఆర్.ఇవాళ సాయంత్రం సీఎంను కలవనున్నారు ఖమ్మం జిల్లా అభ్యర్ధులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com