దళితులు ధనవంతులుగా మారి చూపించాలి ; కేసీఆర్

ప్రభుత్వ ఉద్యోగులకి కూడా దళితబంధు అందజేస్తామని సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. కాకపోతే ప్రభుత్వ రిటైర్డ్, ఉద్యోగులు అందరికంటే చివరగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీలలో నిరుపేదలకి ముందుగా దళితబంధు ఇస్తామని చెప్పారు. రైతుబందు తరహాలోనే దళితబంధు కూడా అమలు చేస్తామని అన్నారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు. వాస్తవానికి ఈ పధకాన్ని ఏడాది కిందే మొదలుపెట్టాలని కానీ కరోనా కారణంగా వాయిదా పడిందని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 21 వేల ఎస్సీ కుటుంబాలున్నాయని అన్నారు. దళితబంధు పధకం దేశానికి కాదు యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. మిషిన్ భగీరధ లాగే మిగతా రాష్ట్రాలు కూడా దళితబంధు స్కీం ని అమలు చేస్తాయని అన్నారు. ఈ పధకం కోసం ఏకంగా 22వేల కోట్లను ఖర్చు చేస్తున్నామని, దళితబంధు విజయం సాధించాలంటే అందరు ఒకే పని కాకుండా వేర్వేరు పనులు చేయాలనీ అన్నారు. దళితులు కూడా ధనవంతులుగా మారి చూపించాలని అన్నారు. హుజూరాబాద్ లో స్వయంగా తిరిగి దళితబంధు పధకం అమలును తానూ పరీశిలిస్తానని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com