ప్రభుత్వ ఉద్యోగులకి కూడా దళితబంధు.. కేసీఆర్

హుజూరాబాద్ లో దళితబంధు బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకి కూడా దళితబంధు అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ రిటైర్డ్, ఉద్యోగులు అందరికంటే చివరగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుబందు తరహలోనే దళితబంధు అమలు చేస్తామని అన్నారు. ఎస్సీలలో నిరుపేదలకి ముందుగా దళితబంధు ఇస్తామని అన్నారు కేసీఆర్.
KCR POINTS :
హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు.
వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రతిభ సాధించాం.
తెలంగాణ రైతాంగం పూర్తి భరోసాతో ఉంది.
రైతు బీమా కూడా బ్రహ్మాండంగా అమలవుతోంది.
తెలంగాణ రాదన్నారు సాధించి తెచ్చాం.
కరెంట్, నీళ్లు ఇస్తామంటే ఎవరూ నమ్మలేదు.
అనుకున్నలక్ష్యాలను సాధించాం.
దళిత బంధు పథకం మీద చాలా మందికి అనుమానాలున్నాయి.
ఏ ప్రధాని కానీ, ముఖ్యమంత్రి కానీ ఆలోచించారా.. పది లక్షలు ఇవ్వాలనే ఆలోచన వారికి రాలేదు.
విపక్షాలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాయి. హుజూరాబాద్‌లో 11వేల దళిత కుటుంబాలున్నాయి. సభకు వచ్చిన వారందరికీ జై భీం.
దేశంలో ఉన్న 165 జాతులు అణచివేతకు గురయ్యాయి.
ధైర్యంగా దళితులు బాగుపడాలని ముందడుగు వేస్తే విమర్శిస్తారా
అతి తక్కువ భూములు, అతి తక్కువ ఆస్తులు ఉన్నవారు దళితులే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com