బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
సీఎం కేసీఆర్‌ నాగర్‌ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు

సీఎం కేసీఆర్‌ నాగర్‌ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాల‌యాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజును కుర్చీలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. అంతకుముందు పార్టీ కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ త‌ల్లికి పూల‌మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 52 కోట్లతో నిర్మించిన జిల్లా కలెక్టరేట్‌, 35 కోట్లతో చేపట్టిన పోలీసు భవన సముదాయాల‌ను కేసీఆర్ ప్రారంభించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

Tags

Next Story