గెలుపు గుర్రాల వైపే గులాబీ బాస్

మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు గులాబీ బాస్ ప్రణాళికలు రచిస్తున్నారు. నియోజక వర్గాల వారిగా సర్వేలు చేయిస్తున్నారని సమాచారం. వ్యతిరేకత ఉన్న నియోజక వర్గాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన కేసీఆర్..గ్రౌండ్ లెవల్ నుంచి సమాచారం సేకరిస్తున్నారు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుంటున్నారని..అవసరమైతే సిట్టింగ్‌లను మార్చే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు పార్టీ నేతల మధ్య విభేదాలు ఉన్న నియోజక వర్గాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్న గులాబీ బాస్ గెలుపు గుర్రాలకే టికెట్లివ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో కొందరు సిట్టింగ్‌లను తప్పించి కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే సిట్టింగ్‌ల మార్పు అంశం ముందుగానే లీక్ అయితే నేతలు పార్టీ మారే అవకాశం ఉండటంతో సీక్రెట్‌గా ఉన్నట్లు సమాచారం.
మరోవైపు గతంలో పార్టీ సమావేశాల్లో సిటింగ్‌లకే టికెట్లు ఇస్తానన్న కేసీఆర్..ఇటీవల జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలోగ్రాఫ్ సరిగా లేని ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే విషయంలో మరోసారి ఆలోచిస్తామని వార్నింగ్ ఇచ్చారు. జనాదరణ తగ్గిన వారికి టికెట్ ఇచ్చి సీట్లు కోల్పోయే పరిస్థితి తెచ్చుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారట. ఇప్పటికే చాలా సార్టు సర్వేలు చేయించిన గులాబీ బాస్.. ఎప్పటికప్పుడు నియోజక వర్గాల్లో కూడా గ్రౌండ్ లెవల్ ఫీడ్‌బ్యాక్‌ను కూడా తెప్పించుకొని అభ్యర్ధుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
ఇక బీఆర్‌ఎస్‌పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలపై కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.ఈ మధ్య కాలంలో పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ ఎమ్మెల్యేల తీరుపై బహి రంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో ప్రతికూలతలను అధిగమించేందుకు అటు అధినేత కేసీఆర్‌తోపాటు ఇటు ఎమ్మెల్యేలు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ క్యాడర్‌లో, ప్రజల్లో ఏయే వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయన్నది సర్వేల ద్వారా సేకరించి వాటిని అధిగమించేందుకు..బీఆర్‌ఎస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. మొత్తం మీద మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీఆర్‌ఎస్ అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అవసరమైతే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు. గులాబీ బాస్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com