ఎల్లుండి ఎల్బీస్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగసభ

X
By - kasi |26 Nov 2020 12:41 PM IST
ఎల్బీస్టేడియంలో ఎల్లుండి సీఎం కేసీఆర్ బహిరంగసభలో పాల్గొననున్నారు. ఇందుకోసం ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. మంత్రులు తలసాని సహా ముఖ్యనేతలు ఏర్పాట్లను చూస్తున్నారు. ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి KTR స్టేడియంకు వెళ్లి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. 28న సభలో హైదరాబాదీలను ఉద్దేశించి CM కేసీఆర్ మాట్లాడతారని, విపక్షాల అన్ని విమర్శలకు సమాధానం చెప్తారని KTR అన్నారు. ఈ సభకు భారీగా తరలిరావాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com