గ్రేటర్ ఎన్నికలు : సీఎం పాల్గొనే ఏకైక ప్రచార సభ ఇదే..

గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారాలు హోరెత్తుతున్నాయి.. అధికార -విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. ఇప్పటికే మంత్రి కేటీఆర్ టీఆర్‌ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.. ఇప్పుడు సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.. ఎల్బీ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరు కానునన్నారు.. సీఎం పాల్గొంటున్న ఏకైక ప్రచార సభ ఇదే కావడంతో.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి టీఆర్‌ఎస్ శ్రేణులు.. సభకు భారీగా జన సమీకరణపై ఫోకస్ పెట్టారు. ఒక్కో డివిజన్ నుంచి దాదాపు మూడు వేల మందిని సమీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే భారీగా టీఆర్‌ఎస్ అభిమానులు, కార్యకర్తలు ఎల్బీ స్టేడియంకు చేరుకుంటున్నారు. దీంతో ఎల్బీ పరిసరాలు మొత్తం గులాబిమయమయ్యాయి..
సీఎం కేసీఆర్ సభకు భారీగా జనం హాజరయ్యే అవకాశం ఉండడంతో సభ లోపల, వెలుపల 12 భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. అలాగే కరోనా నిబంధనల్లో భాగంగా 2 లక్షల మాస్కులు, శానిటైజర్లు ఉచి పంపిణీ చేస్తున్నారు.. ట్రాఫిక్ దృష్ట్యా ఎల్బీ స్టేడియం పరిధిలో పోలీసలు ఆంక్షలు విధించారు. కరోనా టెన్షన్.. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సభ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com