BRS: మంత్రులకు సీఎం కేసీఆర్‌ టార్గెట్‌

BRS: మంత్రులకు సీఎం కేసీఆర్‌ టార్గెట్‌

మంత్రులకు సీఎం కేసీఆర్‌ టార్గెట్‌ పెట్టారు. జిల్లాలో ఎమ్మెల్యేలను గెలిపించాల్సిన బాధ్యత మంత్రులదేనని.. మూడోసారి అధికారంలోకి రావాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు పూర్తి బాధ్యతలు మంత్రులకే అప్పగించారు కేసీఆర్.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డికి.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కేటీఆర్, గంగుల, కొప్పుల ఈశ్వర్‌కు, ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌కు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్‌కు.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీష్ రెడ్డికి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డి.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ప్రశాంత్ రెడ్డి, గ్రేటర్ పరిధిలో తలసాని, సబిత ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డికి ఎమ్మెల్యేల్ని గెలిపించాల్సిన బాధ్యతలు అప్పగించారు.

జిల్లాల్లో మంత్రులకు.. పలువురు ఎమ్మెల్యేలకు మధ్య అంతర్గత విభేదాలు ఉన్న నేపథ్యంలో.. అందర్నీ కలుపుకొని పనిచేయాల్సిందే అని మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. అసంతృప్త వాదులను బుజ్జగించాలని.. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని.. కుల సంఘాలు, లబ్ధిదారులతో మినీ సభలు, సమావేశాలు పెట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో సీట్ల గెలుపు ఆధారంగానే మంత్రుల భవిష్యత్ ఆధారపడి ఉందని.. ఫలితాల్లో తేడా వస్తే కేబినెట్‌లో నో ఛాన్స్ అంటూ.. మంత్రులకు గులాబీ బాస్‌ తేల్చి చెప్పారు.

Tags

Next Story