తెలంగాణ

Harish Rao : సీఎం కేసీఆర్ మాత్రమే మత్స్య కార్మికుల సమస్యలపై స్పందించారు : హరీష్‌రావు

Harish Rao : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి హరీష్‌రావు. ఫిషరీష్ అధికారులతో ఆయన రివ్యూ నిర్వహించారు.

Harish Rao : సీఎం కేసీఆర్ మాత్రమే మత్స్య కార్మికుల సమస్యలపై స్పందించారు : హరీష్‌రావు
X

Harish Rao : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి హరీష్‌రావు. ఫిషరీష్ అధికారులతో ఆయన రివ్యూ నిర్వహించారు. ఎన్నో ఏళ్ల నుంచి కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయాలని, నూతన సభ్యత్వాలు ఇవ్వాలని మత్స్య కార్మికుల నుంచి డిమాండ్ ఉందన్నారు. కానీ ఏ ప్రభుత్వం వారి డిమాండ్ పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే మత్స్య కార్మికుల సమస్యలు, డిమాండ్లపై స్పందించారని తెలిపారు.

కొత్త సభ్యత్వం చేపట్టడం, కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయడం వల్ల మత్స్య కార్మికులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు హరీష్‌రావు. సొసైటీలో సభ్యులు ఎక్కువ మంది ఉంటే బీమా సౌకర్యం కలుగుతుందని.. రుణ సౌకర్యం సులువు అవుతుందన్నారు. ప్రభుత్వ సబ్సిడీ పథకాలు అందరికీ వర్తిస్తాయని తెలిపారు. ప్రతీ చెరువు కాళేశ్వరం నీటితో కళకళలాడుతోందని తెలిపారు.

చెక్ డ్యాంలు పెద్ద ఎత్తున జిల్లాలో నిర్మించామని.. దీని వల్ల నీటి వనరులు పెరిగాయని.. వీటిలో చేపల పెంపకం ద్వారా మత్స్యకార కుటుంబాలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయడంతో పాటు, పాత సొసైటీల్లోనూ ఎకరానికి ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాల్సి ఉందన్నారు. దీని వల్ల పాత సొసైటీల్లోనూ కొత్తగా సభ్యులను ఎంపిక చేయవచ్చన్నారు.

Next Story

RELATED STORIES