రాష్ట్ర బడ్జెట్‌పై నేడు సీఎం మధ్యంతర సమీక్ష

కరోనా మహమ్మారి వల్ల తెలంగాణకు జరిగిన ఆర్థిక నష్టంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. 2020-21 మధ్యంతర బడ్జెట్, సవరణలపై చర్చించనున్నారు. కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, సీఎస్, ఆర్థికశాఖ అధికారులు, అన్నిశాఖల కార్యదర్శులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్నిశాఖల కార్యదర్శులతో సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులపైనా సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశానికి వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్, యాదాద్రి కలెక్టర్, ఆర్‌అండ్‌బీ, దేవదాయ అధికారులు హాజరు కానున్నారు. ఆలయ నిర్మాణ పనుల్లో పురోగతిపై సమీక్షలో చర్చించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com