తెలంగాణలో వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష..!

తెలంగాణలో వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష సమీక్షించారు. ఢిల్లీలో ఉన్న కేసీఆర్... సీఎస్ సోమేష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ సరఫరా, రోడ్ల పరిస్థితిపై దృష్టి పెట్టాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల‌్లో సహాయ చర్యలు తీసుకోవాలని చెప్పారు. నీటి పారుదలశాఖ అధికారులు అప్రమత్తం కావాలని ఆదేశించారు. వాతావరణశాఖ సూచనలపై అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ప్రజాప్రతినిధులు అధికారుల్ని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలని అధికారులకు చెప్పారు. వర్షాలు కురుస్తున్న సమయంలో జనం బయటకు రావొద్దని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com