మహానేతలపై అక్బరుద్దీన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించాలి : బండి సంజయ్

మహానేతలపై అక్బరుద్దీన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే సీఎం కేసీఆర్ స్పందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు నిరసగా.. ఆయన నెక్లెస్ రోడ్డులోని పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లను సందర్శించారు. ఇద్దరు మహానేతల సమాధులకు నివాళులర్పింఆచరు. పీవీ జయంతి ఉత్సవాలు జరపడమే కాదు గౌరవాన్ని కూడా కాపాడాలని టీఆర్‌ఎస్‌కు సూచించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్రల జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ అంటున్నారని.. దానిపై పక్కా సమాచారం ఉంటే చర్యలెందుకు తీసుకోవట్లేదని అధికార పార్టీని సంజయ్ ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కనుమరుగు కాబోతోందన్నారు.
మొదట మాజీ ప్రధాని పీవీ నరసింహరావు సమాధికి బండి సంజయ్ నివాళులు అర్పించారు. పీవీ ఘాట్‌ను రక్షిస్తామని సమాధిపై ప్రమాణం చేసి చెప్పారు. పీవీ సమాధి కూల్చేస్తామన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. రాజకీయ అవసరాల కోసమే కేసీఆర్ నాటకాలడుతున్నారని మండిపడ్డారు.
పీవీ ఘాట్ నుంచి నేరుగా ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి అక్కడ మహా నేత సమాధికి నివాళులర్పించారు. ఎన్టీఆర్ కాలిగోటికి సరిపోదు అక్బరుద్దీన్ పార్టీ, మీరెంత?.. మీ పార్టీ ఎంత? అని ప్రశ్నించారు. దమ్ముంటే పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లను అక్బరుద్దీన్ కూల్చాలన్నారు. ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న కేటీఆర్.. డ్రామారావు అయ్యారని విమర్శించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com