CM KCR: ఎన్నికలు సమీపిస్తున్న వేళ పక్కా ప్రణాళిక.. 17 రోజులు 42 సభలు

CM KCR: ఎన్నికలు సమీపిస్తున్న వేళ పక్కా ప్రణాళిక.. 17 రోజులు 42 సభలు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏది చేసినా పక్కాగా ఉంటుంది. తన అంచనాలు ఎప్పుడూ తారు మారు కావని ఆయనకు ఓ ప్రగాఢ నమ్మకం.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏది చేసినా పక్కాగా ఉంటుంది. తన అంచనాలు ఎప్పుడూ తారు మారు కావని ఆయనకు ఓ ప్రగాఢ నమ్మకం. అందులో భాగంగానే నవంబర్ 7న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచార షెడ్యూల్ ని ఖరారు చేశారు. తన వాడి వేడి మాటలతో ప్రత్యర్థిని మట్టి కరిపించే కేసీఆర్ ఈసారి ఏఏ అస్త్రాలు సంధించబోతున్నారు.. తమకే మళ్లీ ఎందుకు పట్టం కట్టాలి అనే దానిపై కసరత్తు చేస్తూ ముందడుగు వేస్తున్నారు. ఓటరు నాడిని పట్టుకుని పథకాలు ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.

టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ అయింది. అసలైన సమరం ఇప్పుడే మొదలైంది. తనతో నడిచే వచ్చే వివిధ రాష్ట్రాల సీఎంలను కూడా కలుపుకుని కేంద్రంలో పాగా వేయాలని చూస్తున్న కేసీఆర్ కు ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. కచ్చితంగా గెలిచి తీరాలంటే ఇంతకు ముందు కంటే మెరుగైన పథకాలు తీసుకు రావాలి. బలమైన ప్రత్యర్థులు కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించాలి. అదే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ ప్రచార వ్యూహాన్ని పార్టీ అధినేతలు ఖరారు చేశారు. ఈ నెల 15న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్స్ అందజేసిన రోజు నుంచే ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు.

గులాబీ బాస్ తన ప్రచార పర్వాన్ని సెంటిమెంటుగా భావిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తారు. తొలి విడత 17 రోజుల్లో 42 నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగిస్తారు. నవంబర్ 9న రెండు నియోజక వర్గాల్లో నామినేషన్ దాఖలు చేసి సభల్లో పాల్గొంటారు. 15వ తేదీన హుస్నాబాద్ సభతో ప్రచారం జోరు మొదలు కానుంది. 15 నుంచి 18 తేదీ వరకు 5 నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తారు. దసరా పండుగ తర్వాత 26 నుంచి తిరిగి ప్రచారం ప్రారంభిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story