KCR Vanaparthy Tour : నేడు వనపర్తికి సీఎం కేసీఆర్.. మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం

KCR (tv5news.in)
KCR Vanaparthy Tour : తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగా సభలో పాల్గొని ప్రసంగిచనున్నారు సీఎం కేసీఆర్. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన, సభా ఏర్పాట్లను మంత్రి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు.
వనపర్తి పర్యటనలో భాగంగా 40 ఎకరాల్లో 45 కోట్లతో నిర్మించిన అధునాతన వ్యవసాయ మార్కెట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం బాలుర ఉన్నత పాఠశాలలో మన ఊరు- మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. వనపర్తి జిల్లా నాగవరం శివారులో 50 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టర్ భవనం ప్రారంభిస్తారు.
5 వందల కోట్లతో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవనం, 50 కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కాలేజీకి, 76 కోట్లతో నిర్మించనున్న కర్నెతాండ లిప్టు పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com