KCR Delhi Tour :మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న సీఎం కేసీఆర్‌

KCR Delhi Tour :మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న సీఎం కేసీఆర్‌
KCR Delhi Tour : తెలంగాణ సీఎం కేసీఆర్‌... ఢిల్లీలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్.. సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు అక్కడే ఉండనున్నారు.

KCR Delhi Tour : తెలంగాణ సీఎం కేసీఆర్‌... ఢిల్లీలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్.. సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు అక్కడే ఉండనున్నారు. సెప్టెంబర్‌ 2న టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యానికి భూమి పూజ చేయనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 3న సీఎం కేసీఆర్‌ తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. ఢిల్లీలోని వసంత్‌ విహార్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలోని 13 వందల గజాల స్థలంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి జరిగే భూమి పూజ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌ సభ, రాజ్యసభ సభ్యులు సహా పలువురు ముఖ్యనేతలు హాజరుకానున్నారు.

Tags

Next Story