KCR : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నేడు టీఆర్ఎస్ రైతు దీక్ష..!

KCR : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నేడు టీఆర్ఎస్ రైతు దీక్ష..!
KCR : కేంద్రం కావాల‌నే తెలంగాణ రైతుల ప‌ట్ల క‌క్షపూరితంగా ప్రవర్తిస్తోందని టీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు.

KCR : దేశ రాజధాని కేంద్రంగా మోదీ సర్కారుపై నిరసనకు TRS సిద్ధమయ్యింది. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల స్థాయి నుంచి ఆందోళనలు చేపట్టిన గులాబీ దళం.. రైతు దీక్ష పేరుతో ఢిల్లీ వేదికగా..కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయనుంది. పంటల కొనుగోలులో జాతీయ విధానం అమలు చేయాలని... డిమాండ్‌ చేయనుంది. ఇందుకోసం హస్తినలో.. తెలంగాణ భవన్‌ వద్ద వేదికగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రైతులు 300 కోట్ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం పండించార‌ని.. చివరి గింజ వరకు కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కేంద్రం కావాల‌నే తెలంగాణ రైతుల ప‌ట్ల క‌క్షపూరితంగా ప్రవర్తిస్తోందని టీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. పంజాబ్, హ‌ర్యానాలో ధాన్యం సేక‌రించిన మాదిరిగానే తెలంగాణ నుంచి కూడా ఎఫ్‌సీఐ ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని అంటున్నారు. కేంద్రం తీరు మారేందుకే ఢిల్లీలో ధ‌ర్నా చేస్తున్నామ‌ని అంటున్నారు . 15 వందల మంది ప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా వేదిక నిర్మించారు. ధర్నా ఏర్పాట్ల కోసం టీఆర్‌ఎస్‌ నేతలు.. వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ మహాధర్నాకు సంబంధించి ఏర్పాట్ల ను ఎప్పటికప్పుడు నేతలకు ఆదేశాలు ఇస్తున్నారు. మిగతా ప్రజాప్రతినిధులంతా ఢిల్లీకి చేరుకున్నారు. మరో 3వేల 500 మంది రైతులు కూడా పాల్గొనేలా టిఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఎండలను దృష్టిలో పెట్టుకొని దీక్షా ప్రాంగణమంతా టెంట్ల... కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. కేంద్రం దిగొచ్చి ధాన్యం మొత్తం కొనుగోలు చేసే వరకు టీఆర్ఎస్‌ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు హెచ్చరిస్తున్నారు.

ఢిల్లీలో చేపట్టే మహాధర్నాకు వివిధ రైతు సంఘాల ముఖ్యమైన ప్రతినిధులను కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఢిల్లీ వేదికగా జరిగిన రైతు ఉద్యమం.. మోడీ సర్కార్ దిగివచ్చి మూడు చట్టాలను వెనక్కి తీసుకునేలా చేసినా ముఖ్యమైన రైతు సంఘాల నేతలు ధర్నాలో కూర్చున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో వరి పోరుపై అనేక కార్యక్రమాలు చేసిన TRS ఢిల్లీ వేదికగా చేపట్టబోయే మహాధర్నా జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టే KCR ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో తెలంగాణ భవన్‌ సహా.. ఇతర ప్రాంతాల్లోనూ TRS ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. తెలంగాణలోని TRS ప్రజాప్రతినిధులను ఢిల్లీలో మోహరించటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా... ఈ స్థాయిలో నిరసన వ్యక్తం చేయలేదని భావిస్తున్నారు. హస్తినలో మహాధర్నా సక్సెస్ చేసి మరింత ఉత్సాహంతో రాష్ట్రానికి తిరిగి వచ్చి కేంద్రంపై తమ పోరాటం కొనసాగుతుందని అంటున్నారు టిఆర్ఎస్ నేతలు.

Tags

Read MoreRead Less
Next Story