Lockdown : తెలంగాణలో మరో 10 రోజులు పాటు లాక్ డౌన్..?

Lockdown : తెలంగాణలో మరో 10 రోజులు పాటు లాక్ డౌన్..?
రేపటితో తెలంగాణలో లాక్ డౌన్ ముగియనుంది. లాక్ డౌన్ కొనసాగించాలా లేదా అనే అంశంపై రేపు మంత్రి వర్గం భేటీ కానుంది.

రేపటితో తెలంగాణలో లాక్ డౌన్ ముగియనుంది. లాక్ డౌన్ కొనసాగించాలా లేదా అనే అంశంపై రేపు మంత్రి వర్గం భేటీ కానుంది. లాక్ డౌన్ అమలు, ఇంటింటి జ్వర సర్వే , కొవిడ్ ఓపీ సేవలు వంటి అంశాలపై రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గుతుంది. మహమ్మారి వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉండే వివిధ వర్గాల వారిని సూపర్ స్పైడర్ లుగా గుర్తించి వారికి ప్రత్యేకంగా టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానుంది. రాష్ట్రంలో మరో వారం లేదా పది రోజుల పాటు లాక్డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నాలుగు గంటల సడలింపు సమయంలో ప్రజలు భారీగా బయటకు రావడం మినహాయింపుల పేరుతో మరికొందరు రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలో ఆ విషయం పైన మంత్రివర్గ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో లాక్ డౌన్ ఫలితాలను ఇస్తుందా లేదా కరోనా పరిస్థితి ఏమిటన్న దానిపై సీఎం కేసీఆర్ స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి స్థానిక వివరాలను అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్ మరికొన్ని రోజులు కొనసాగించడం మేలన్న అభిప్రాయం ఎక్కువ మంది నుంచి వినిపిస్తున్నట్టుగా సమాచారం.

ఈ నేపథ్యంలో లాక్ డౌన్ మరో వారం, పది రోజులు తొలగించడం వల్ల వైరస్ వ్యాప్తిని ఇంకా కట్టడి చేయొచ్చనే అభిప్రాయంతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మరికొన్ని రోజులు అప్రమత్తంగా ఉండటంతో పాటు ఆంక్షలు కొనసాగించాలని ఆలోచనతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నాలుగు గంటల పాటు సడలింపు సమయంలో ప్రజలు భారీగా బయటకు వస్తున్నారు. రద్దీని తగ్గించేందుకు ఆ సమయంలో మార్పు చేయాలని ఆలోచన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఉదయం 6 గంటల నుంచి కాకుండా 7 గంటల నుంచి 12 గంటల వరకు సడలింపు ఇవ్వాలని అంటున్నారు.

మినహాయింపుల పేరుతో భారీగా రోడ్లపైకి వస్తున్న వారిని కట్టడి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితులు తదుపరి కార్యాచరణకు సంబంధించి ఆయా శాఖలు నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. అన్ని అంశాలను పూర్తిస్థాయిలో చర్చించి రేపటి కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ లాక్ డౌన్ పైన ఓ నిర్ణయం తీసుకోనున్నారు. మరో వారం లేదా పది రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నాయని, అయితే వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కొన్ని సడలింపులు ఉండొచ్చని తెలుస్తోంది.



Tags

Read MoreRead Less
Next Story